ఓటు వేసేముందు ఒక్కసారి ఆలోచించండి.
మరి కొన్ని గంటల్లో మీ ఐదేళ్ల భవిష్యత్తును , మీరు నిర్ణయించుకోబోతున్నారు! అవును, మీరు వేయబోయే ఒక్క ఓటు మీ భవిష్యత్తుకు ఆధారం. అందుకే ఐదేళ్ళ అధికారాన్ని అవినీతిపరులకి, అసమర్ధులకి కాకుండా ,సమర్ధులకి ,సమాజాన్ని మంచి దారిలో నడిపెవారికి అప్పగిద్దాం.
స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా భారతదేశం ఎందుకు వెనకబడి ఉంది? కారణాలెన్ని ఆయినా మూలకారణం ఒక్కటే ,'రాజకీయ అవినీతి' .రాజకీయాల్ని సమాజసేవకు మార్గంగా కాకుండా ,వ్యాపార రంగంగా మార్చిన సనాతన రాజకీయ నాయకులే కారణం.పది కోట్లు పెట్టి పార్టీ టిక్కెట్టు కొని, వంద కోట్లు దండుకొనే అవినీతి రాజకీయ నాయకులే అన్ని రంగాల్లో వెనకబాటుతనానికి మూలకారణం!అందుకే రాజకీయం పేరుతో దోపిడీ చేస్తున్న ఈ చెడ్డ రాజకీయాలకి స్వస్తి పలికి మంచి రాజకీయాన్ని స్వాగాతిద్దాం.
ఇప్పటికీ మనకు నాణ్యమైన రోడ్లు లేవు, నాణ్యమైన విద్య లేదు,రెండుపూటలా కడుపునిండని పేదకుటుంబాలెన్నో ఉన్నాయి.ఈ సమస్యలన్నింటికీ పరిష్కారాలున్నాయి, కానీ ఈ రాజకీయ నాయకులకి ఇవేమీ పట్టవు. ఎంతసేపూ ఎంత సంపాదించాం, మన పేరు ఎంత పెంచుకున్నాం అని ఆలోచించే వారు ,సమస్యలకి పరిష్కారం ఎలా చేస్తారు? "నన్ను పాము కరుస్తోంది , బతికించండి మహాప్రభో! " అంటే పామును చంపకుండా, నొప్పి తెలియకుండా ఉండేందుకు నోట్లో పంచదార పోసే రకం ఈ రాజకీయనాయకులు . పాములాంటి సమస్యలని చంపకుండా , నోట్లో పంచదార లాంటి పథకాలతో ప్రజల్ని మోసం చేస్తున్నారు.అందుకే సమస్యల్ని దాచిపెట్టేవారికి కాకుండా , వాటిని చంపే వారికి అవకాశం ఇద్దాం .
ఇన్నాళ్ళు వీళ్ళు చేసింది చూసారు .ఇకపై కూడా వెళ్ళనే గద్దేనేక్కిస్తారా?
'లోక్ సత్తా' మంచి రాజకీయానికి మార్గం చూపిస్తోంది.ఒక్కసారి వాళ్ళకి అవకాశం ఇద్దాం. ఇప్పటికే మనలో చాలామంది లోక్ సత్తా గెలిస్తే బాగుంటుందని అనుకున్నారు,కానీ తన ఒక్క ఓటుతో గెలుస్తుందా అని అనుమానపడుతున్నారు. కానీ మీవేనుక చాలామంది ఉన్నారు .మీరు సందేహించకండి!
సగటున ప్రతి ఇంట్లో అయిదుగురు ఓటర్లున్నారు. మీ ఓటుతో పాటు మరో ఇద్దరిని లోక్ సత్తా కు ఓటు వేసేలా ప్రోత్సహించండి.బలవంతంగా వేయించనవసరం లేదు . మీరు నమ్మిన దాన్ని వివరించండి. డబ్బు, మందు, చీరలు ,ఆర్ధిక పరిస్థితిని నాశనం చేసే పథకాలు, ఇవేనా మీరు వేసే ఓటు విలువ? ఎంత మాత్రమూ కాదు, కాకూడదు. సమాజాన్ని మంచి దారిలో ముందుకు నడిపేందుకు మీ ఓటు దారి చూపాలి.
ఒక్కసారి లోక్ సత్తా కి అవకాశం ఇచ్చి చూడండి. మార్పును చూపండి.మీ ఓటును ఉపయోగించుకోండి. తప్పకుండా ఎన్నికల్లో పాల్గొనండి . మీ ఓటును వృధా చేయకండి.
మీకు తెలిసిన మరొక్కరికి ఈ మెయిల్ ను పార్వర్డ్ చేయండి. దయచేసి మరిచి పోకండి.
Saturday, April 11, 2009
Subscribe to:
Posts (Atom)